జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గంలో జరిగిన ఉగ్రదాడి మూలన రాజస్థాన్‌లో ఓ యువడికి పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది.ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలకు దిగింది.దీనిలో భాగంగా అట్టారి-వాఘా సరిహద్దును మూసివేసింది.
ప్రభుత్వం విధించిన ఆంక్షలతో నిశ్చితార్థం వరకు వచ్చిన రాజస్థాన్ వాసి సైతాన్‌సింగ్ వ్యక్తి పెళ్లి ఆగిపోయింది.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్ ఫ్యామిలీ పాక్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు.పెళ్లి దగ్గర పడుతుండటంతో పనులు ప్రారంభించారు.పెళ్లి కొడుకు బంధువులు కొంతమంది పాకిస్థాన్‌లోని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఇంతలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది.దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం ఐదు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అట్టారి-వాఘా సరిహద్దును భారత్ మూసివేయడంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో సైతాన్ సింగ్ వివాహం నిలిచిపోయింది.