టి20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికవడం తన చేతిలో లేదని ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అన్నారు. ప్రతి మ్యాచ్ ను బాగా ఆడేందుకు ట్రై చేస్తానని చెప్పారు. తాను క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారని, కానీ కొన్ని విషయాలు ప్లేయర్ల పరిధిలో ఉండవని పేర్కొన్నారు.
ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నిలో రాణించడం ముఖ్యం అని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కాగా, ఇండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరికి చోటు కల్పించలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో దేశవాళీ క్రికెట్ ఆడాలని తాజా ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని వీరిద్దరికీ ఇటీవల బీసీసీఐ చురకలు అంటించింది. దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ కి మొండిచేయి ఎదురైంది.