సారీ.. లవ్‌.. ఆ రింగ్‌ పోయింది : హై జంపర్ ఎమోషనల్ పోస్టు

-

ఇటలీకి చెందిన స్టార్ హై జంప్‌ అథ్లెట్ జియాన్మార్కో టాంబేరి పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో తన వెడ్డింగ్ రింగ్ను పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇటలీ తరఫున జాతీయ పతాకాధారిగా వ్యవహరించిన జియాన్మార్కో.. సెన్‌ నదిపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన రింగ్‌ను మిస్‌ అయ్యాడు.

‘‘ఐ యామ్‌ సారీ మై లవ్. అక్కడ ఎక్కువగా నీళ్లు ఉన్నాయి. గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లి రింగ్‌ నీళ్లలో పడిపోయింది. ఆ రింగ్‌ పడిపోవడానికి ఇంతకుమించిన గొప్ప ప్రాంతం మరొకటి ఉండదేమో. ‘సిటీ ఆఫ్‌ లవ్‌’కు వేదికైన నదిలో నిక్షిప్తం కావడం అద్భుతం. దీని కంటే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా సంగ్రామంలో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించడం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ కొత్తగా ప్రమాణాలు చేసుకుందామని నువ్వు అప్పుడప్పుడూ అడుగుతుంటావు కదా. ఇప్పుడు మళ్లీ కాస్త డిఫరెంట్గా పెళ్లి చేసుకుందాం. పారిస్‌ నుంచి అంతకంటే విలువైన గోల్డ్‌తో ఇంటికి వస్తాను’’ అని తన భార్య చైరా బోంటేమిని ఉద్దేశించి టాంబేరి పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version