Ms ధోనిని అవమానించాడు జోగేంద్ర శర్మ.. ఇక రిటైర్ అవ్వు అంటూ కామెంట్స్ చేసాడు. ప్రముఖ స్టార్ క్రికెటర్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని తనదైన ఆట తీరుతో టీమిండియాకు ఎనలేని విజయాలను అందించాడు. ఇక ధోని వయసు పెరుగెత్తుతున్న కొద్ది ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. దీంతో ధోని రిటైర్మెంట్ పైన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా, సీఎస్కే మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ సంచలన కామెంట్లు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ “ఫిట్నెస్ ఉన్నంతవరకే మ్యాచ్లు ఆడాలి అని అన్నాడు. ధోని ప్రస్తుత ఫిట్నెస్ లెవెల్ ను చూస్తే తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది అని జోగేందర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా 2007 t20 వరల్డ్ కప్ ఫైనల్ లో జోగిందర్ శర్మ చివరి ఓవర్ వేసి భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోగిందర్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.