కూటమికి మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. నేను సీఎం అయ్యాక.. సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు జగన్. నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ అత్యవసర సమావేశం జరిగింది.

కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్పొరేటర్లతో, వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో ఈ రోజు వైయస్ జగన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జగన్ మాట్లాడారు. మేము మాత్రం అన్యాయం చేసిన వాళ్లకు సినిమా చూపిస్తాం… ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తామని హెచ్చరించారు మాజీ సీఎం వైఎస్ జగన్. రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తామన్నారు. అన్యాయాలు చేసిన వారి సినిమా చూపిస్తామని తెలిపారు.
🔥
ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాజగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది
కొడతానంటే.. కొట్టమనండి.. కానీ బుక్ లో పేర్లు రాసుకోండి
రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం
దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం
అన్యాయాలు చేసిన వారి సినిమా చూపిస్తాం
– వైఎస్ జగన్ 🔥🔥 pic.twitter.com/iaG5ZEgJiC
— Rahul (@2024YCP) May 20, 2025