KKR eliminated from IPL 2025: IPL 2025 నుంచి KKR ఎలిమినేట్ అయింది. IPL 2025లో భాగంగా KKRతో జరిగిన మ్యాచ్‌లో CSK జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన KKR 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. బ్రేవిస్ తుఫాను ఇన్నింగ్స్ పాటు దూబే కూడా రాణించడంతో CSK 2 వికెట్ల తేడాతో 183 పరుగులు సాధించింది.

ఇక, ఇవాళ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో KKR ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఇక ఈ మ్యాచ్ లో CSK ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ఇరగదీశాడు. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్ లో మూడు సిక్సులు, మూడు ఫోర్లు కొట్టి 30 పరుగులు చేశాడు. ఇదే ఊపులో 22 బంతులకే అర్ధ శతకం కూడా కొట్టేశాడు. కానీ 13వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి.. బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపాడు.