KL Rahul: క్రికెట్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై ?

-

KL Rahul’s Instagram Post Triggers Retirement Talks: క్రికెట్ కు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నాడా? అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ఇచ్చి…రెస్ట్‌ తీసుకోనున్నాడని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన బ్యాటర్లలో ఒకడు. అయితే, గత రెండు సంవత్సరాలుగా, వికెట్ కీపర్ బ్యాటర్ భారత T20I జట్టులో స్థానం కోల్పోవడంతో, ప్రదర్శన పరంగా రాహుల్‌ ఫేయిల్‌ కూడా అవుతున్నారు.

KL Rahul’s Instagram Post Triggers Retirement Talks

భారత క్రికెట్ జట్టు సభ్యులు జాతీయ విధులకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో భారీ ఊహాగానాలకు దారితీసింది. రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ముఖ్యమైన ప్రకటన చేయవలసి ఉందని చెప్పారు. ఈ ప్రకటన అతని క్రికెట్ భవిష్యత్తుతో పూర్తిగా సంబంధం లేనిది అయినప్పటికీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ పోస్ట్‌ తో క్రికెట్ కు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్పనున్నాడా? అని అందరూ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version