ఈ ఏడాది ఒలంపిక్స్ నుండి క్రికెట్ వరకు ఇండియా అందుకున్న ఘనవిజయాలు ఏంటో తెలుసుకుందాం. ప్యారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్ గేమ్స్ లో ఇండియాకు ఆరు పతకాలు వచ్చాయి. అందులో 1 రజత పతకం కాగా ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఐదింటిలో మూడు కాంస్య పతకాలు షూటింగ్ లోనే వచ్చాయి. కాగా, ఒకటి హాకీలో ఇంకోటి రెజ్లింగ్ లో వచ్చింది.
2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మొట్టమొదటి పతకాన్ని పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మనూ భాకర్ సాధించింది. ఆమెకు కాంస్య పతకం లభించింది. అదే పోటీలో సర్బజ్యోత్ సింగ్ కి కాంస్యం వచ్చింది. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వప్నిల్ కి కాంస్యం లభించింది.
ఇక రెజ్లింగ్ లో అమన్ శెరావత్ కి కాంస్య పతకం లభించింది. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకి ఖచ్చితంగా బంగారు పతకం వస్తుందని అందరూ ఊహించారు. కానీ అతనికి రజత పతకం వరించింది.
అదలా ఉంచితే పారాలింపిక్స్ లో ఇండియాకు 29 పతకాలు వచ్చాయి. అందులో 7 స్వర్ణం, తొమ్మిది రజతం, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ లో పతకాల పట్టికలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది.
ఒలింపిక్స్ వదిలేస్తే.. ఈ ఏడాది ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ని భారత జట్టు అందుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో వెస్టిండీస్ లో ప్రపంచకప్ ని అందుకుంది.