BREAKING: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. సంధ్య థియేటర్ సంఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికి తెలిసిందే. తన సినిమాను అభిమానులతో కలిసి చూదాం అని థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో.. సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇక ఈ తొక్కిసలాటలోనే ఓ మహిళా మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసింది పోలీసులు.. లిస్ట్ లో ఆలు అర్జున్ పేరు ను కూడా నమోదు చేసారు. ఈ తరుణంలోనే.. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు.