టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఘోరంగా అవమానించింది. గత కొన్నాళ్ళుగా ధోని రిటైర్మెంట్ విషయంలో అనేక ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ధోనీ వన్డే క్రికెట్ కి గుడ్‌బై చెప్తాడని కోచ్ రావిశాస్త్రి ప్రకటించిన కొన్ని రోజులకే ధోనిని కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బోర్డ్. ప్రతి ఏడాది క్రికెటర్లకు ఇచ్చే కాంట్రాక్టులో ధోనికి చోటు కల్పించలేదు.
ప్రపంచకప్ తర్వాత ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి తోడు రాజకీయాల్లోకి ధోని వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతూ వచ్చింది. ఈ తరుణంలో ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే సూచనలు కనపడుతున్నాయనే కథనాలు వెలువడ్డాయి. ధోని క్రికెట్ నుంచి తప్పుకోక ముందే, ఇలా కాంట్రాక్ట్ నుంచి తప్పించి అవమానించడమే అని నెటిజన్లు భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు 7 కోట్లు, ఏ గ్రేడ్‌కు 5 కోట్లు, బి గ్రేడ్‌కు 3 కోట్లు, సి గ్రేడ్‌కు 1 కోటి చొప్పును బిసిసిఐ చెల్లిస్తుంది. గ్రేడ్ల వారీ ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ+ – కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా.
ఏ – అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, పంత్
బి – సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్.
సి – జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్.
కాంట్రాక్టు ఇచ్చింది బోర్డ్. దీనితో త్వరలోనే ధోని తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.