హైదరాబాద్ గడ్డపై సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవి చూసింది. IPL-2025లో ఈ రోజు ఉప్పల్ వేదికగా MIతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘోర పరాజయం చెందింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న MI.. నిర్ణీత 20 ఓవర్లలో SRHని 143 పరుగులకే కట్టడి చేసింది.

ఛేజింగ్‌లో 3 వికెట్లు కోల్పోయిన ముంబై అలవోకగా టార్గెట్‌ని ఫినిష్ చేసింది. MI బ్యాటర్లు రోహిత్, సూర్య ధాటికి 15.4 ఓవర్లోనే మ్యాచ్ ముగిసింది. దింతో హైదరాబాద్ గడ్డపై సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవి చూసింది.
కాగా, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ వికెట్‌తో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా ఈ ఫీట్‌ని 237 ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేయడం విశేషం. కాగా, ఈ ఫీట్‌ని ఆండ్రూ టై 211 ఇన్నింగ్స్‌లో, రషీద్ ఖాన్ 213 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేశారు.