టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. దీంతో ఈ మ్యాచ్ లో 250కి పైగా స్కోరు నమోదు కానుందని అభిమానులు పేర్కొంటున్నారు. సొంత మైదానంలో హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు. ముంబయి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతుంది. సన్ రైజర్స్ జట్టు మాత్రం కేవలం 2 మ్యాచ్ ల్లో విజయం సాధించి పేలవ ప్రదర్శన కనబరుస్తోంది.

మరోవైపు జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ చీర్ లీడర్స్ లేకుండానే మ్యాచ్ జరుగనుంది. అలాగే గెలిచిన తరువాత సెలబ్రేషన్స్ ఉండవని.. నల్ల బ్యాడ్జీలు ధరించాలని BCCI నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని ప్రకటించింది BCCI. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారని తెలిపింది. ఇవాల్టి IPL మ్యాచ్లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు : 

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్, కమిన్స్, హర్షల్, ఉనద్కత్, అన్సాలీ, మలింగ.

ముంబై ఇండియన్స్ జట్టు : 

రికెల్ టన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్, జాక్స్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, విగ్నేశ్, బుమ్రా.

Read more RELATED
Recommended to you

Latest news