భారత ప్రముఖ షట్లర్ అలాగే ఒలింపిక్ లో రెండు సార్లు పతకాలు సాధించిన పీవీ సింధు ఎన్నికల లో పోటీ చేస్తుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో పీవీ సింధు పోటీ లో ఉంటుంది. ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఎన్నికలు వచ్చే నెల 17 న నిర్వహించ నున్నారు.
కాగ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య లో మొత్తం ఆరు మహిళ స్థానాలు ఉంటాయి. వీటి కోసం ప్రపంచ వ్యాప్తం గా తొమ్మిది మంది అథ్లేటిక్స్ పోటీ పడుతున్నారు. కాగ భారత స్టార్ షట్లర్ వీపీ సింధూ ఈ ఎన్నికలలో రెండో సారి పోటీ చేస్తుంది. గతం లో ఒక సారి పోటీ చేసి విజయం సాధించింది. ఈ సారి కూడా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తూ పోటీ లో ఉంటుంది. కాగ పీవీ సింధూ 2017 లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అథ్లేటిక్స్ కమిషన్ ఎన్నికలలో పోటీ చేసింది. అప్పడు విజయం సాధించి ఇప్పటి వరకు అథ్లేటిక్స్ కమిషన్ లో కొనసాగుతుంది.