సెమీస్ కు దూసుకుపోయిన పీవీ సింధు

-

బ్యాడ్మింట‌న్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ను కొన‌సాగిస్తుంది. ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పీవీ సింధు త‌న దైన శైలీ లో దూసుకుపోతుంది. శుక్ర వారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లో పీవీ సింధు విజ‌యం సాధించి సెమీ ఫైనల్ కు దూసుకుపోయింది. కాగ క్వార్టర్‌ ఫైనల్లో పీ వీ సింధు 14–21, 21–19, 21–14తో ద‌క్ఖిణ కొరియా కు చెందిన‌ సిమ్‌ యుజిన్ పై 66 నిమిషాల్లో గెలిచింది.

నేడు జ‌ర‌గ‌బోయే సెమీ ఫైన‌ల్ లో థాయ్ లాండ్ కు చెందిన‌ ర‌చ‌నోక్ తో పీ వీ సింధు త‌ల ప‌డ‌నుంది. అలాగే ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ లో నుంచి సాయి ప్ర‌ణీత్ అవుట్ అయ్యాడు. ఈ టోర్న‌మెంట్ లో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్ దేశాని కి చెందిన అక్సెల్‌సన్ పై సాయిప్రణీత్‌ 12–21, 8–21 తేడా తో ఓట‌మి పాలయ్యాడు. అలాగే పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–19, 21–19తో మ‌లేసియా కు చెందిన‌ గో జె ఫె–నూరూజుద్దీన్‌ జంటపై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version