ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. గతంలో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ లో ఇవాళ ఎలాగైన విజయం సాధించి టాప్ ప్లేస్ లోకి వెళ్లాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. వాస్తవానికి వీరిద్దరిలో ఎవరు మ్యాచ్ గెలిస్తే.. వారు టాప్ ప్లేస్ లోకి వెళ్లడం ఖాయం. ఈ హోరా హోరీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డూప్లెసిస్, పోరెల్, కరుణ్ నాయర్, రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, విప్రజ్, చమీరా, స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లీ, జాకోబ్ బిచెల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, క్రుణల్ పాండ్యా, రొమారియో, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హజిల్ వుడ్, యశ్ దయాల్.