సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రిప్ గౌతమ్ గంభీర్ అంటూ పోస్టులు పెడుతున్నారు రోహిత్ శర్మ. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో రిప్ గౌతమ్ గంభీర్ పేరు ఉంది.. రోహిత్‌ను అవమానకరంగా తప్పించారంటున్నారు ఫాన్స్.. గంభీర్, కోహ్లీ కలిసి గేమ్ ఆడారని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
గంభీర్ వచ్చాకే టీమ్ ఇండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని.. తప్పించాల్సింది గంభీర్ ను అంటూ ఫ్యాన్స్ ట్వీట్ లు చేస్తున్నారు. కాగా, ఐదో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. టీం నుంచి కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ను కాదని.. బుమ్రాకు బాధ్యతలు ఇచ్చారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో… కేఎల్ రాహుల్ ఓపెనర్ వెళ్లాడు.