నా కాలు తొలగిస్తారేమోనని భయపడ్డా : రిషభ్ పంత్

-

నా కాలు తొలగిస్తారేమోనని భయపడ్డానంటూ టీమిండియా వికెట్‌ కీపర్ రిషభ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను ఫాన్స్ తో పంచుకుంటున్నారు. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను బౌన్స్ బ్యాక్ క్యాప్షన్ తో ఇన్స్టాలో పోస్ట్ చేశారు.

Rishabh Pant reveals he feared leg amputation after life-threatening car crash

ఇది ఇలా ఉండగా, కారు ప్రమాదం తర్వాత కాలు తొలగిస్తారేమోనని భయపడినట్లు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….’ప్రమాదం తర్వాత కుడి మోకాలు డిస్ లోకేట్ అయినట్లు అర్థమైంది. తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అక్కడికి వచ్చిన కొందరితో నా మోకాలును సరిచేయాలని అడిగా. ప్రమాదంలో కాలు నరాలు దెబ్బతినే ఉంటే డాక్టర్లు కాలు తీసేస్తారేమోనని తీవ్రంగా ఆందోళన చెందా’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version