సుందర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్..

-

టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవిచూసింది. బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్ ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైనా చెత్త ప్రదర్శనతో గెలిపించారు. అయితే ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేయడానికి వచ్చాడు శార్దూల్ ఠాకూర్. ఈ ఓవర్ నాలుగవ బంతిని బంగ్లా బ్యాటర్ మెహదీ హాసన్, థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. బాల్ అమాంతం గాల్లోకి లేచింది.

ఈ క్రమంలోనే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ రెండు అడుగులు వేస్తే సింపుల్ క్యాచ్ అయ్యి ఉండేది. దాంతో బంగ్లా ఆల్ అవుట్ అయ్యి టీమ్ ఇండియా విజయం సాధించేది. కానీ సుందర్ బాల్ ను అలానే చూస్తూ కనీసం కదలలేదు. దాంతో ఈ దృశ్యాన్ని చూసిన రోహిత్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో వాట్ ది F**K అంటూ బూతులతో రెచ్చిపోయాడు. ఇలాంటి సింపుల్ క్యాచ్లను మిస్ చేస్తే సహజంగానే ఎవరికైనా కోపం వస్తుంది. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం బాలు చూస్తూ కూడా అక్కడి నుంచి కదలకపోవడం నిజంగానే ప్రేక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ బూతులు తిట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version