రోహిత్ శర్మకు గాయం..ఆస్పత్రికి తరలింపు !

-

IND vs BAN : నేడు బంగ్లాతో సెకండ్ వన్డేలో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ రెండో వన్డే మ్యాచ్ బంగ్లాదేశ్ లోని డాకా వేదికగా జరగ నుంది. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి… బ్యాటింగ్‌ ఎంచుకుంది బంగ్లా. అయితే, బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బౌలింగ్ చేస్తున్న భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ షాక్ ఇచ్చాడు.

రెండో వన్డేలో మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన అనముల్ హాక్, ఆ తర్వాత రెండు పరుగులు తీశాడు. మరుసటి బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. సిరాజ్ వేసిన బంతి ఎక్స్ ట్రా బౌన్స్ అవడంతో బ్యాటును తాకి సెకండ్ స్లిప్స్ లో ఉన్న రోహిత్ శర్మ వైపు వెళ్ళింది. దాన్ని అందుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు. చేతుల్లోకి వచ్చిన క్యాష్ ను జారవిడిచాడు. ఈ క్రమంలో రోహిత్ మణికట్టుకు గాయమైంది. అది నొప్పి పెట్టడంతో అతను మైదానం వీడాడు. రోహిత్ స్థానంలో సబ్స్టిట్యూట్ గా రజత్ పటిదార్ ఫీల్డింగ్ కు వచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version