మాకు కోహ్లీ… ఓపెనర్‌ ఆప్షనే మాత్రమే – రోహిత్ శర్మ సంచలనం

-

ఆసియా కప్‌ 2022 లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. రేపటి నుంచి.. ఆసీస్‌ తో తలపడనుంది. రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో, ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఇక ఈ సిరీస్ కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రసంగించాడు.

ఈ సందర్భంగా విరాట్ ఓపెనింగ్ గురించి రోహిత్ మాట్లాడుతూ, ‘విరాట్ కోహ్లీ మా మూడో ఓపెనింగ్ ఆప్షన్. అతను కొన్ని మ్యాచ్ లలో ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. ఆసియా కప్ చివరి మ్యాచ్ లో ఓపెనర్ గా అతను ఆడిన తీరుతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. అతని ప్రదర్శన గురించి పెద్దగా నోటీస్ కాలేదు. కానీ అతను మంచి ఓపెనర్. మాకు ముఖ్యమైన ఆటగాడు. మేము మా ఆలోచన విధానంలో చాలా స్పష్టంగా ఉన్నాం. జట్టు పరంగా ఎలాంటి గందరగోళం లేదు. కేఎల్ రాహుల్ జట్టు కోసం ఎలాంటి రోల్ కనబరుచుతాడో అనే విషయమై కూడా మాకో స్పష్టత ఉంది’ అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version