రాజ్ కోట్ టెస్ట్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలిరోజు పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(10), శుభ్ మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాచ పరిచారు. రోహిత్ శర్మ మాత్రం సెంచరీ చేశారు. రవీంద్ర జడేజా కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 130 పరుగులు చేసి క్రీజులో ఉండగా.. ఆల్ రౌండర్ జడేజా 83 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టావ్ హార్ట్లీ ఒక వికెట్ పడగొట్టారు.
టెస్ట్ ల్లో రోహిత్ కి ఇది 11వ సెంచరీ కాగా.. ఇండియాలో 6వది. రాజ్ కోట్ లో సెంచరీ బాదిన 4వ ఓపెనర్ గా రోహిత్ నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (18,577) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని కంటే ముందు సచిన్ (34,357), కోహ్లీ 26,733, ద్రవిడ్ 24,280 పరుగులు సాధించారు. అదేవిధంగా టెస్ట్ ల్లో అత్యధిక సిక్సులను బాదిన బ్యాటర్లలో ధోనిని (78) వెనక్కి నెట్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (79) రెండో స్థానానికి చేరుకున్నాడు. సెహ్వాగ్ (90) తొలిస్థానంలో కొనసాగుతున్నారు.