ఫార్ములా ఈ రేసింగ్కు సచిన్ టెండూల్కర్, ధావన్

-

నేడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లబోతున్నాయి. ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

అయితే, ఈ ఈవెంట్ లో పలువురు క్రికెటర్లు సందడి చేశారు. సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, చాహల్, దీపక్ చాహార్ రేసింగ్ చూడడానికి వచ్చారు. వారిని చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. కాగా, సాయంత్రం 45 నిమిషాల పాటు మెయిన్ రేస్ నిర్వహిస్తారు. ఈ సమయంలో 18 మలుపులతో ఉన్న హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లో 32 లాప్స్ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్ ను తేల్చేందుకు మరో ల్యాప్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్ ఫోర్ విన్నర్ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version