బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్-ఏ జట్టుతో జరగనున్న అనధికారిక వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 22 నుంచి చెన్నై వేదికగా జరగనున్న ఈ మూడు వన్డేల సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి( బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది.
సంజూ శాంసన్ టి20 ప్రపంచ కప్ పక్కనపెట్టిన భారత సెలెక్టర్లు, న్యూజిలాండ్ తో అనధికారిక వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు. ప్రపంచ కప్ ముందు సౌత్ఆఫ్రికా తో జరగనున్న 3 వన్డేల సిరీస్ కోసమే అతన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కు టీ20 ప్రపంచ కప్ కు ఎంపికైన ఆటగాళ్లంతా దూరం కానున్నారు. అక్టోబర్ 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా సంజు శాంసన్, శిఖర్ ధావన్, సిరాజ్ వంటి ఆడవాళ్ళతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్-ఏ తో ఆడనున్న భారత్-ఏ జట్టులో తెలుగు క్రికెటర్లు కేఎస్ భరత్, తిలక్ వర్మ చోటు దక్కించుకున్నారు.
Sanju Samson will lead the India A squad for the one-day series against New Zealand A later this month
The three-match series starts on September 22, and will be played in Chennai pic.twitter.com/2gxImy7KJb
— ESPNcricinfo (@ESPNcricinfo) September 16, 2022