పాక్ కు వస్తే ఇండియాను మరిచిపోయేలా కోహ్లికి ఆతిథ్యం : షాహిద్అ ఫ్రిదీ

-

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఏ దేశంలో ఈ బ్యాటర్ ఫీల్డ్లోకి దిగినా అక్కడి స్టేడియం అంతా క్లోహీ పేరుతో మార్మోగిపోవాల్సిందే. ఇక పాకిస్థాన్లో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి పాకిస్థాన్కు వస్తే భారత్ను మర్చిపోయే రీతిలో తమ అతిథి మర్యాదలు ఉంటాయని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నాడు.

విరాట్కు పాకిస్థాన్లో చాలామంది అభిమానులు ఉన్నారని తెలిపాడు. ‘విరాట్ ఒకవేళ పాకిస్థాన్కు వస్తే భారత్కు మించి మా అతిథి మర్యాదలు ఉంటాయి. అతడికి ఇక్కడ అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ పాకిస్థాన్లో ఆడితే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని ఓ సందర్భంలో అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, 2008లో అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటివరకు పాక్లో క్రికెట్ ఆడలేదు. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, భద్రతాకారణాల దృష్యా టీమ్ఇండియా పాక్లో పర్యటించబోదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version