CCL 2023 : సీసీఎల్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్..

-

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. భోజ్ పురి దబాంగ్ తో జరిగిన ఫైనల్ లో గెలిచిన తెలుగు జట్టు నాలుగోసారి సిసిఎల్ టైటిల్ ను గెలుపొందింది. విశాఖ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్, తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిని ఆరు వికెట్లు నష్టానికి 72 పరుగులకే పరిమితం చేసింది.

కెప్టెన్ అక్కినేని అఖిల్ మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. దీంతో టాలీవుడ్ జట్టు 10 ఓవర్లలో 104/4 తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో తెలుగు జట్టుకు 32 పరుగుల కీలక ఆదిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆదిత్య ఓజ, ఉదయ్ తివారి రాణించడంతో బోజ్ పురి జట్టు ఆరు వికెట్ల నష్టానికి 89 రన్స్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆదిక్యంలో ఉన్న తెలుగు వారియర్స్ ముందు రెండో ఇన్నింగ్స్ లో 58 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు జట్టు ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version