మూడో టి20 టై… సూపర్ ఓవర్…!

-

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టి20 టై అయింది. కీలక సమయంలో కెప్టెన్ విలియమ్సన్ అవుట్ కావడంతో కివీస్ జట్టు మరో పరుగు దూరంలో విజయానికి దూరమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టుకి ఆదిలో రోహిత్ శర్మ రూపంలో ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీం ఇండియా ను భారి స్కోర్ దిశగా వెళ్ళకుండా కట్టడి చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకి ఓపెనర్లు రోహిత్ శర్మ కెఎల్ రాహుల్ మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరి పూర్తి చేసుకున్నాడు. బెన్నెట్ వేసిన 6 ఓవర్లో రోహిత్ ఏకంగా మూడు సిక్సులు బాది 28 పరుగులు రాబట్టాడు.

ఆ తర్వాత కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్ దూకుడు తగ్గింది. ఈ క్రమంలో 19 బంతుల్లో ఒక సిక్స్ రెండు ఫోర్లతో 27 పరుగులు చేసిన మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ గ్రాండ్ హోం బౌలింగ్ లో మున్రోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే ఆకట్టుకోలేదు. కెప్టెన్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తో కలిసి కాస్త కష్టపడ్డాడు. ఇద్దరు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

స్కోర్ పెంచే క్రమంలో అయ్యర్ 16 బంతుల్లో 17 పరుగులు చేసి స్ట౦ప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే 6 బంతుల్లో 14 పరుగులు చేయగా రవీంద్ర జడేజా ఒక సిక్స్ తో టీం ఇండియా చెప్పుకోదగిన స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా శాంట్నర్, గ్రాండ్ హోం ఒక వికెట్ తీసారు.

ఆ తర్వాత మోస్తరు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కివీస్ జట్టుకి వచ్చిన కేన్ విలియమ్సన్ అండగా నిలిచాడు. సెంచరీతో చెలరేగిపోయాడు. భారత బౌలర్ల మీద ఎదురు దాడి చేసాడు. 48 బంతుల్లో ఆరు సిక్సులు 8 ఫోర్లతో 95 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గుప్తిల్, మున్రో 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా జడేజా బౌలింగ్ లో మున్రో అవుట్ అవగానే క్రీజ్ లోకి వచ్చి ఆది నుంచి సిక్స్ లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే కీలక సమయంలో విలియమ్సన్ అవుట్ కావడం శమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టై అయింది. దీనితో సూపర్ కి వెళ్ళింది మ్యాచ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version