IPL 2024: విశాఖ మ్యాచ్‌ల‌కు నేటి నుంచి టిక్కెట్ల విక్రయం..ధరల వివరాలు ఇవే

-

 

IPL 2024: విశాఖ వాసులకు గుడ్ న్యూస్‌. ఇవాళ్టి నుంచి ఐపీఎల్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైజాగ్ లో ఈ నెల 31, ఏప్రిల్‌ 3న ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు అందుబాటులో ఉంటాయి.

Tickets for Visakhapatnam matches on sale from today

ఏప్రిల్‌ 3న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఇవాళ్టి నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు. అలాగే, ఈ నెల 31న చెన్నై సూపర్ కింగ్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించారు. పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. టికెట్ల ధరలు రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500, రూ.1,000గా ఉండనున్నాయి.

టికెట్ల ధరలు

  • రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 టిక్కెట్లు విక్రయాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version