ఐసీసీ అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులు వేసి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ ను బెంబేలేత్తించింది.అనంతరం 69 పరుగుల లక్ష్యఛేదనకు దిగి భారత్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది.
దీంతో తొలిసారి ఇండియా ఉమెన్స్ క్రికెట్ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. అయితే… భారత్ ప్రపంచకప్ గెలవడంలో భద్రాచలం బిడ్డ త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ లో తెలుగు అమ్మాయి త్రిష(24) పరుగులు చేసి… చివరీ వరకు ఉండి ఇండియాను గెలిపించింది. అలాగే… ఓ కీలక క్యాచ్ పట్టి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. ఇక దీనిపై హర్షం వ్యక్తం చేశారు భద్రాచలం ప్రజలు, త్రిష అభిమానులు.