2024 సంక్రాంతి బరిలో పోటీ పడనున్న హీరోలు వీళ్లే..!

-

సంక్రాంతి అనేది స్టార్ హీరోల పెద్ద సినిమాలకు ఎప్పుడు ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. ఇటీవల విడుదలైన రెండు కమర్షియల్ సినిమాలు ఎలాంటి కలెక్షన్ అందుకున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ ను అందుకొని సాలిడ్ లాభాలు అందుకోగా.. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. 2023 సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే ఇప్పుడు 2024 ని టార్గెట్ చేస్తూ కొన్ని పెద్ద సినిమాలు విడుదల డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఎన్టీఆర్ మినహా అల్లు అర్జున్ , ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్లంతా కూడా 2024 సంక్రాంతి బరిలో పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2024 సంక్రాంతికి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న భగత్ సింగ్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు సమాచారం. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న ఆర్సి15 ప్రాజెక్ట్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. వీటితోపాటు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రావాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇప్పుడు ఈ నాలుగు సినిమాలతో పాటు నాగార్జున ప్రముఖ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడతో చేస్తున్న ప్రాజెక్టు కూడా 2024 సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ క్లాష్ లో అయితే తప్పకుండా రెండు సినిమాలు డ్రాప్ అవడం పక్క అని చెప్పవచ్చు. వీటికంటే ముందు డిసెంబర్లో వెంకటేష్ సైంధవ సినిమా ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version