వైరల్; గర్ల్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ని బ్లాక్ చేసిన యువ క్రికెటర్…!

-

టీమిండియా యువ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ ఆడేది తక్కువ చేసే హడావుడి ఎక్కువ అని సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొకటి అంటూనే ఉంటారు అభిమానులు. ఐపియల్ లో రెచ్చిపోయే ఆడే ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆడిన మ్యాచులు చాలా తక్కువ. కాని కెప్టెన్ కోహ్లీ మాత్రం అతనికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. టీం ఇండియా సీనియర్లు కూడా అతనికి మద్దతు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే అతను బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాతో ప్రేమలో పడ్డాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అతను ఆమెతో డేట్ కి వెళ్ళాడు అని సోషల్ మీడియా కోడై కూసింది. కాని ఇది నిజం కాదని అతను ఇటీవల చేసిన ట్వీట్లు చెప్తున్నాయి. తన గాళ్‌ ఫ్రెండ్ ఇషానేగితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఊర్వసికి అతనికి చెడిందని అందుకే ఇషా నేగీతో ప్రేమలో పడ్డాడని,

ఊర్వశితో అతనిది లవ్ కాదు ఫ్రెండ్షిప్ మాత్రమే అని అంటున్నారు. ప్రస్తుతం పంత్ ఇషాతో రిలేషన్ లో ఉన్నాడట. అందుకే ఇక ఊర్వశిని అతను పక్కన పెట్టి, ఇషా తో మాత్రమే ఉండి ఆట మీద దృష్టి పెట్టాలి అని భావిస్తున్నాడట. అందుకే ఊర్వశిని వాట్సాప్ లో బ్లాక్ కూడా చేసాడట. ఊర్వశి అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ఊర్వశి కూడా అతన్ని బ్లాక్ చేసిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version