BCCI బాస్ సౌరవ్ గంగూలీ పదవి పోవడానికి కారణం ధోనీనే..!

-

బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, బీజేపీ రాజకీయాలకు బలి అయినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తప్పుకోబోతున్న గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారని, అయితే గంగూలీ దానిని సున్నితంగా తిరస్కరించాలని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. గంగూలీ తప్పుకోవడం ఏమో గాని, సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. బిజెపి రాజకీయాలకు సౌరవ్ గంగూలీ బలైయాడని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తే, జై షా వెన్నుపోటు పొడిచారని దాదా ఫ్యాన్స్ వాపోయారు.

చేసుకున్న పాపం ఎక్కడికి పోదని కర్మ సిద్ధాంతం అనుభవించాల్సిందేనని కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. టీం సెలెక్షన్ లో అతి జోక్యం, బోర్డులో దాదా గిరి సభ్యులకు నచ్చలేదని దాంతో రెండోసారి బీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు నిరాకరించారని ప్రముఖ స్పోర్ట్స్ పేర్కొంది. తాజాగా సౌరవ్ గంగూలీ పదవి తొలగింపు వెనుక ధోని హస్తం కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ద్వారా గంగూలీ కి ధోని చెక్ పెట్టాడనేది ఆ వార్తల సారాంశం. బిసిసిఐ కి అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ పనితనం విషయంలో విమర్శలు గుప్పించారట. అతని స్థానంలో రోజర్ బిన్నీని బిసిసిఐ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని బిసిసిఐ సమావేశంలో గట్టిగా వాదించారట. సి ఎస్ కే బాస్ ఏం చేసినా దాని వెనక మహేంద్రసింగ్ ధోని ప్రమేయం ఉంటుందనేది చాలామందికి తెలిసిన విషయమే. ధోని సూచనలతో సి ఎస్ కే బాస్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడాడంట.

Read more RELATED
Recommended to you

Exit mobile version