WTC ఫైనల్ 2023 : ప్రమాదకర వార్నర్ ను పెవిలియన్ కు పంపిన శార్దూల్ ఠాకూర్… !

-

ఈ రోజు నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియాల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేశారు తెలుగు కుర్రాడు మహమ్మద్ సిరాజ్. ఆ తర్వాత మరో వికెట్ తీయడానికి ఇండియా బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు. క్రీజులో ప్రమాదకర డేవిడ్ వార్నర్ మరియు లాబుచెన్ లు ఇండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు జత చేస్తున్నారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో వార్నర్ ను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు.

ఈ వికెట్ ద్వారా ఇండియాకు మంచి బ్రేక్ త్రూ దొరికింది అని చెప్పాలి. మరి ఈ వికెట్ ను సద్వినియోగం చేసుకుని ఇండియా వెంట వెంటనే వికెట్లు తీయగలిగితే ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. మరి చూద్దాం ఇండియా బౌలర్లు రాణిస్తారా లేదా ?

Read more RELATED
Recommended to you

Exit mobile version