మరోసారి ఛాంపియన్‌గా కోనేరు హంపీ..జగన్‌ రియాక్ట్‌ !

-

మరోసారి ఛాంపియన్‌గా కోనేరు హంపీ చరిత్ర సృష్టించారు. ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి అభినందనలు తెలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు జగన్.

YCP chief YS Jagan congratulated Indian Grandmaster, Telugu legend Tejam Koneru Hampi for becoming the FIDE Women’s World Rapid Chess Champion

ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించిన జగన్.. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకమని వివరించారు. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచిందన్న జగన్.. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానంటూ అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version