2024లో కంపెనీలు ప్రొఫెషనల్స్ ని జాబ్ లోకి తీసుకునే విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం విపరీతంగా పెరిగిన వేళ హైరింగ్ ప్రాసెస్ లో అనేక మార్పులు వచ్చాయి.
డిగ్రీలు అక్కర్లేదు, నైపుణ్యం చాలు:
జాబ్ చేసేంత నైపుణ్యం, సామర్థ్యం ఉన్నా డిగ్రీ లేదన్న కారణంగా ఇంతకుముందు జాబ్స్ కి తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డిగ్రీ లేకపోయినా స్కిల్స్ ఉంటే చాలు అంటున్నారు. డిగ్రీ పొందితే స్కిల్స్ వచ్చేసినట్టే అనే నమ్మకం పటాపంచలు అయిపోయింది.
పెరుగుతున్న ఫ్రీ లాన్సింగ్:
ఒక కంపెనీలో ఎంప్లాయ్ గా వర్క్ చేసేవాళ్లు తగ్గిపోతున్నారు. ఆ కంపెనీ తాలూకు ప్రాజెక్టును తీసుకుని.. దాన్ని పూర్తిచేసి డబ్బులు తీసుకుని మళ్ళీ వేరే కంపెనీలో మరో ప్రాజెక్ట్ కి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఫ్రీ లాన్సింగ్ పెరుగుతోంది. దీనివల్ల ఒకే కంపెనీ మీద ఆధారపడటం తగ్గిపోయింది.
జాబ్ సెర్చ్ ప్రాసెస్‍లో ఏఐ టూల్స్ వినియోగం:
జాబ్ సెర్చ్ చేసే ప్రాసెస్ లో ఏఐ టూల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రెస్యూమ్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి ప్రతి దానిలో ఏఐ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం చాలా ఉద్యోగాలు ఏఐ రిలేటెడ్ గా మారిపోతున్నాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ:
ఇంతకుముందు పని పని అంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పోయేవారు. ఇప్పుడు అది మారుతుంది. కార్పొరేట్ కంపెనీలు కేవలం శాలరీ మాత్రమే ఇస్తాయని, ఆరోగ్యం కాపాడుకోవాల్సింది మనమే అని విషయం అందరికీ అర్థమైపోయింది.