ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట్లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో మళ్ళీ పాత కథే అని అంతా అనుకున్నారు. కానీ మూడవ మరియు నాలుగవ మ్యాచ్ లలో తన శక్తిమేరకు విజృంభించి పంజాబ్ మరియు కోల్కతా లాంటి జట్లను ఓడించి వరుసగా రెండు విజయాలను అందుకుంది. ఈ రోజు ముంబై తో హైదరాబాద్ లో మ్యాచ్ ఆడనుండగా.. తుది జట్టులో ఒక కీలక మార్పు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. పంజాబ్ జట్టు కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ ను SRH రూ. 8 .25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు తాను ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ సరైన ప్రదర్శన చేయడంలో దారుణంగా విఫలం అయ్యాడు.
రూ. 8.25 కోట్ల SRH ప్లేయర్ కు ముంబై తో మ్యాచ్ ప్లేస్ దక్కదా ?
-