ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ‘అండర్ డాగ్’ గా బరిలోకి దిగి అదరగొట్టిన శ్రీలంక ఇప్పుడు టైటిల్ పైనే కన్నేసింది. సూపర్-4 లో అజేయంగా నిలిచిన సింహల జట్టు ఇప్పుడు ఫైనల్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సూపర్-4 లో తడబడుతూ తుదిపోరుకు చేరిన పాకిస్తాన్ తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ తో బాగా ఆడిన పాకిస్తాన్ తర్వాత క్రికెట్ కూన ఆఫ్గనిస్తాన్ తో చచ్చిచెడి చివరి ఓవర్లో ఆఖరి వికెట్ తో గట్టెక్కింది.
గత మ్యాచ్ లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ అజమ్ మినహా ఇంకెవరు 14 పరుగులైన చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తుంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోట కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆల్ అవుట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. ఇక ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ ఇండియా తలపడనుండగా.. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
sl : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), చరిత్ అసలంక/ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్/అసిత ఫెర్నాండో, దిల్షన్ మదుషన్
pak : మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్