నటి శ్రీరెడ్డి.. సినిమాలకు దూరంగానే ఉంటున్నా.. సోషల్‌మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడామె సంపాదన గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతంటే?
టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఓ దశలో ఆమె మీడియాలో ఫుల్ పాపులర్ అయింది. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని బహిరంగా ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరీపై తన ఇష్టమొచ్చినట్లు బూతుల పూరాణంతో సంచలనం సృష్టించింది.
అలాగే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన చేసి సోషల్‌మీడియా హాట్ టాపిక్‌గా మారింది.అప్పటి నుంచి తనకు నచ్చని వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతూ, నచ్చిన వాళ్ళను పొగుడుతూ వార్తల్లో నిలూస్తూనే ఉంది. అలానే మరోవైపు హాట్ ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు అడగడం చేస్తుంది.
అయితే ఇప్పుడామె ఆదాయం గురించి కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం.. సాధారణంగా ఆమె యూట్యూబ్‌లో ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.అలాగే యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమెకు భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయని తన సన్నిహితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయల సంపాదనను ఆర్జిస్తుందట.మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ కొన్ని వెబ్సైట్లు ఇలా రాస్తున్నాయి.