బిగ్ బాస్ ఆరవ సీజన్ మొదలై రెండు వారాల అవుతున్న నేపథ్యంలో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరికొకరు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మొత్తం 21 మంది కంటెస్టెంట్ లాగా అందరూ కూడా బాగా కలిసిపోయారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో సిసింద్రీ టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ బేబీ డాల్ తో తమకున్న అనుబంధం గురించి ఒక్కొక్కరిగా తెలపాలని కోరాడు. ఇక ఈ క్రమంలోనే కీర్తీ భట్ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించింది. కీర్తి మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ తో అమ్మా, నాన్న, అన్నా ,వదిన, చిన్న పాప అందరిని పోగొట్టుకున్నాను అని తెలిపింది. ఇక దెబ్బలు తగిలి కొద్దిగా స్పృహ వచ్చిన తర్వాత నాన్న బ్రతికే ఉన్నారన్న ఆలోచన వచ్చింది . కానీ ఆ టైంలో నాన్న చనిపోయినట్టుగా అత్తయ్య గట్టిగా చెప్పి ఏడ్చేసరికి అర్థమైందని తెలిపింది.
ఆ తర్వాత 32 రోజులపాటు కోమలోనే ఉన్నాను . ఇక ఇంటికి వచ్చి ఆరు నెలల వరకు కూడా కోలుకోలేకపోయాను. స్ట్రక్చర్ సహాయంతో నడిచిన ప్రతిసారి చాలా బాధ అనుభవించాను. కోలుకొని వచ్చినా కూడా ఇంట్లో ఉన్న బంధువులకు అసలు ఆనందం లేదు. నాకు ఆస్తి ఇవ్వకపోగా ఎన్నో మాటలు అన్నారు. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. బెంగళూరు వచ్చేసాను. రూ.750 తో కట్టుబట్టలతో బెంగళూరుకి వచ్చి ఆకలి వేస్తుంటే కుక్కకు వేసిన బన్ కూడా తిన్నాను. ఆ తర్వాత స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటూనే కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఇక కాల్ సెంటర్ వాళ్ళు నా సర్టిఫికెట్స్ ఇంకా ఐడెంటిటీ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబితే తప్పించుకునే దాన్ని.
ఇక తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ నుంచి పాపను దత్తత తీసుకున్నాను. మోడలింగ్ చేస్తూనే సీరియల్స్ లో ఆఫర్ వస్తే యాక్టింగ్ కెరియర్ లోకి అడుగుపెట్టాను. అంతా బాగుందట అనుకున్న సమయంలో లాక్ డౌన్ వచ్చి పడింది. ఇక ఆ సమయంలో మరెన్నో బాధలు పడ్డాను. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఇక బిగ్ బాస్ క్వారంటైంలోకి వచ్చే ముందు నేను పెంచుకుంటున్న పాప కూడా చనిపోయింది అంటూ ఎమోషనల్ అయిపోయింది కీర్తి.. ఇక పాపకు ఎప్పటినుంచో హెల్త్ ప్రాబ్లం ఉండేదని, ఒకటికి రెండుసార్లు సర్జరీ కూడా చేయించాను అని , ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టాను కానీ పాపం నన్ను విడిచి వెళ్లిపోయింది అంటూ తెలిపింది. కీర్తి బాధని విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోయారు.