ఓటమి అంచున శ్రీలంక.. 8వికెట్లు డౌన్‌

-

భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో శ్రీ‌లంక మూడో వ‌న్డేలో ఓట‌మి అంచుల్లో ఉంది. ష‌మి వేసిన 16వ ఓవ‌ర్‌లో వెల్ల‌లాగే 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. సూర్య‌కుమార్ క్యాచ్ ప‌ట్ట‌డంతో వెల్ల‌లాగే ఇన్నింగ్స్ ముగిసింది. అంత‌కు ముందు ఓవ‌ర్‌లో చైనామ‌న్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ భార‌త్‌కు ఏడో వికెట్ అందించాడు. అత‌ని బౌలింగ్‌లో లంక కెప్టెన్ ద‌సున్ ష‌న‌క బౌల్డ్ అయ్యాడు. బంతిని డిఫెండ్ చేయ‌బోయిన అత‌డిని కుల్దీప్ బోల్తా కొట్టించాడు. దాంతో, ఆశ్చ‌ర్య‌పోయిన ష‌న‌క పెవిలియ‌న్ బాట పట్టాడు. 17 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి శ్రీ‌లంక 8 వికెట్లు కోల్పోయి 55ప‌రుగులు చేసింది. ల‌హిరు కుమార‌, క‌సున్ ర‌జిత క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. కోహ్లీ తన క్లాస్, మాస్ ఆటను చూపిస్తూ లంక బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మాజీ కెప్టెన్ స్కోరులో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దెబ్బకు లంక బౌలర్లు మరింత బెంబేలెత్తిపోయారు. కోహ్లీని అవుట్ చేయలేక, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, కోహ్లీకిది వన్డేల్లో 46వ సెంచరీ. శ్రీలంకతో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేయడం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ 2 సెంచరీలతో అలరించాడు. కోహ్లీ మరో 3 సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును సమం చేయనున్నాడు. ఇక, శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version