పాన్ ఇండియా మూవీ లో శ్రీముఖి కి ఛాన్స్..!

-

శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు శ్రీముఖి అందరికీ సుపరిచితమే. బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెరపై పలు షోలలో కూడా యాంకరింగ్ చేస్తూ ఇంకోపక్క సినిమాలు చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది బుల్లితెరపై ఒక షోలో శ్రీముఖి కనిపించిందంటే మామూలు సందడి ఉండదు.

శ్రీముఖి పండగలు స్పెషల్ డేస్ నాడు పలు కార్యక్రమాలతో సందడి చేస్తూ ఉంటుంది. ఇక శ్రీముఖి కి సంబంధించిన ఒక వార్త నెట్టింట తెగ షికార్లు కొడుతోంది.శ్రీముఖి పాన్ ఇండియా హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమా రాబోతోంది. ఈ సినిమాలో శ్రీముఖి యొక్క కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ కి సిస్టర్ ల నటించబోతోందట మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version