మహారాణిలా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న శ్రీముఖి..!

-

ఎప్పుడు గ్లామర్ షో చేస్తూ తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసే యాంకర్ శ్రీముఖి ఈసారి ఎవరు ఊహించని విధంగా కళ్ళను ఆర్పకుండా చూసే విధంగా యువతను కట్టిపడేసింది. మహారాణిలా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖిని ఇలా ట్రెడిషనల్ లుక్ లో చూసేసరికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటోలను చూస్తూ అలాగే ఉండిపోతున్నారనే చెప్పాలి. అంతేకాదు ఆమె అందాలను జూమ్ చేసి మరి చూస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రెడిషనల్ వేర్ లో వరుస ఫోటోషూట్లు షేర్ చేసి యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్ర కారు హృదయాలను దోచుకునేలా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో సైలెంట్ అయిన ఈమె మళ్లీ వరుస పెట్టి ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో మతులు పోగొడుతూ.. కిరాక్ లుక్స్ తో కుర్ర హృదయాలను దోచుకుంటుంది. తాజాగా లైట్ రెడ్ కలర్ లెహంగా ధరించి.. అందుకు కాంబినేషన్లో గ్రీన్ కలర్ ఓణీ తో చాలా చక్కగా కనిపించిన ఈమె రూబీ హారం ధరించి అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చౌకర్ తో మరింత అందంగా మెరిసిపోతోంది. తలలో మల్లె పువ్వులు.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంతే.. అంతలా తన అందంతో యువతను ఆకట్టుకుంటుంది.

ఇకపోతే సాంప్రదాయ దుస్తుల్లో శ్రీముఖి ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి అయితే బాపు బొమ్మలా మెరిసిపోతూ తన అందాలతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version