అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం పేరు బిఆర్ఎస్ పెట్టింది. దళితులకు దళిత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంకు ఇప్పటి వరకు సీఎం దండ వేయలేదు.
స్పీకర్ ను అవమానం చేశారని సభా సమయాన్ని వృధా చేశారు. స్పీకర్ పై ఒత్తిళ్ళు ఉన్నాయి. స్పీకర్ ను వ్యక్తిగతంగా జగదీష్ రెడ్డి సభలో అన్నట్లు వీడియో బయటపెట్టండి. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని సస్పెండ్ చేసి సభ నడుపుకుంటారా.. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజా సమస్యలపై చర్చించండి. బిల్లులపై చర్చ జరగకుండా ఉండాలని ప్రభుత్వం చూస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం భావిస్తోంది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.