కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు : శ్రీనివాస్ గౌడ్

-

కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయం లో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్టు వస్తాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే. విభజన చట్టం సెక్షన్ 89 కాంగ్రెస్ తెచ్చింది కాదా ..దాని ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కేసీఆర్ ఒప్పుకుంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు వచ్చేవా అని ప్రశ్నించారు.

కేసీఆర్ అధికారం లోకి వచ్చిన నెల రోజుల్లోపే సెక్షన్ 3 ప్రకారం నీళ్ల పంపిణీ జరగాలని కేంద్రానికి లేఖ రాశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కేసీఆర్ ను ఇంకా విమర్శిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కర్ణాటక ప్రాజెక్టులు శరవేగం గా పూర్తి చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని అనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరైనా తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపాలి అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version