ICC చాంపియన్స్ షిప్ ట్రోఫీ.. టీమిండియా జట్టు ప్రకటన

-

త్వరలో జరగబోయే ఐసీసీ చాంపియన్స్ షిప్-2025 ట్రోఫీకి సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. తుది జాబితాలో 15 మందికి చోటు కల్పించింది. అందులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్( వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ఆర్షదీప్, రిషబ్ పంత్ (వికే), రవీంద్ర జడేజా. హర్షిత్ రాణా (రిజర్వు) ప్లేయర్లు ఉన్నారు.

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ టోర్నీ ఆడగా.. అందులో 4-1 తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా డబ్ల్యూటీసీ ప్రపంచకప్‌కు భారత క్రికెట్ జట్టు నామినేట్ కాకుండా బయటకు వచ్చింది.ఫిబ్రవరి 19వ తేదీ నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈసారి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచులను హైబ్రిడ్ వేదికగా నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version