సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ హెల్డ్ బులిటెన్ విడుదల అయింది. ఈ మేరకు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ హెల్డ్ బులిటెన్ విడుదల చేశారు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు, ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు.. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ హాస్పిటల్ ప్రకటించింది.
కాగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన పై ఫిర్యాదు నమోదయ్యింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసాడు యుగేందర్ గౌడ్. ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పిన పట్టించుకోలేదు. నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలి కాగా మరో పసి ప్రాణం ప్రమాదంలో ఉంది. కాబట్టి పుష్ప 2 చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.