కలియుగ ప్రతక్ష్య దైవం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమాయ్యాయి. ఈసారి కొవిడ్తో కార్యక్రమాలలో కొన్ని మార్పులుచేశారు. దీనికి సంబంధించి టీటీడీ ప్రకటించిన వివరాలు తెలుసుకుందాం…
రంగనాయకుల మండపంలో స్థలాబావం కారణంగా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక, స్వర్ణ రథం, రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించనున్న టీటీడీ అధికారులు తెలిపారు. ఇక, వాహనసేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుండి 10గంటల వరకు మాత్రమే శ్రీవారి వాహనసేవలు తిరిగి రాత్రి 7నుండి 8 గంటల వరకు వాహనసేవలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 27న శ్రీవారి ఆలయంలోని అద్దాల మహల్ లో ఉదయం 6 నుండి 9గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆన్ లైన్ లో కళ్యాణోత్సవసేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
– శ్రీ