Breaking : అక్టోబర్‌ 11 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు

-

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయంలో జరిగే నిత్య, వారపు సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని.. 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం శ్రీనివాస కల్యాణం జరుగుతాయని తెలిపారు.

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామికి జరిగే సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. డిసెంబర్ లో ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక కార్తీక మాసంలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ నెలలోనే అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.

భక్తుల రద్దీ, ఇబ్బందుల నేపథ్యంలో తిరుమలలోని గదుల కేటాయింపు కూడా కొండ కింద తిరుపతిలోనే చేపట్టనున్నట్టు ధర్మారెడ్డి తెలిపారు. దీనిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు.. తిరుపతిలోనే గది తీసుకుని ఉండేందుకు వీలుంటుందన్నారు. ఇక భక్తులకు నిర్ణీత సమయానికి దర్శనం కల్పించే టైమ్‌ స్లాట్‌ టోకెన్ల విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆ టోకెన్లు తీసుకునే భక్తులు తిరుపతిలోనే బస చేసి.. నిర్ణీత సమయానికి తిరుమలకు వస్తే సరిపోతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version