SSMB 28: మహేష్ బాబు కొత్త పోస్టర్ రిలీజ్

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే.. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB28’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈనెల 31న ఈ సినిమా టైటిల్ తో పాటు స్ట్రైక్ వీడియో పేరుతో ఓ టీజర్ ను థియేటర్లలో ఫ్యాన్స్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు కండువా తలకు కట్టుకొని, చేతిలో సిగరెట్ పట్టుకున్నట్టు వెనకనుంచి చూపించారు. ఈ మాస్ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version