మహాకుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ సర్కార్ సంచలన నిర్ణయం

-

మహాకుంభమేళాలో తొక్కిసలాట కారణంగా యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కుంభమేళా నిర్వహణలో ఐదు మార్పులు చేసింది. ఇకమీదట తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు మహాకుంభమేళాలో కీలక మార్పులు చేసింది.

ముఖ్యమైన ఘాట్‌ల వద్ధ భక్తుల రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనున్నారు.అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.వన్ వే రూట్ అమలు, వీవీఐపీ పాసులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది దుర్మరణం పాలవ్వగా.. 60 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ సర్కార్ విచారణకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version