సంధ్య థియేటర్లో హీరో అల్లు అర్జున్‌కు స్టాండింగ్ ఓవేషన్..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా గురువారం (డిసెంబర్-5) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాలీవుడ్‌కు కేరాఫ్ అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్రదర్శించబడ్డాయి. సినిమా చూసిన అభిమానులు మూవీ సూపర్ హిట్, బంపర్ హిట్ అంటూ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లి నిన్న రాత్రి ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు.

అయితే, ‘జాతర’ సీన్‌లో ఐకాన్ స్టార్ నటన చూసి ఫ్యాన్స్ అంతా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది చూసిన బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనం విజయం సాధించాం అంటూ అభివాదం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా, పుష్ప-2 విడుదల సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి అల్లు అర్జున్, ‘వైల్డ్‌ఫైర్ పుష్ప’ హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news